: బాబు కుటుంబం బ్లాక్ మనీని మార్చుకున్నాకే ప్రధాని ప్రకటన: రఘువీరారెడ్డి


పెద్ద నోట్లను రద్దు చేయనున్నారన్న విషయం బీజేపీ, టీడీపీ నేతలకు ముందుగానే తెలుసునని, వారంతా తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని సర్దుకున్నాకే మోదీ నోటివెంట ప్రకటన వెలువడిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఈ ఉదయం అనంతపురంలోని సాయినగర్ లో ఎస్బీఐ కార్యాలయం వద్ద అవస్థలు పడుతున్న ప్రజలకు సంఘీభావంగా ఆయన బైఠాయించారు. నోట్ల రద్దుతో చంద్రబాబు, లోకేష్ లకు ప్రయోజనాలు కలిగాయని ఆయన ఆరోపించారు. ప్రధాని ప్రకటనకు గంటల ముందు ఓ బీజేపీ నేత కోటి రూపాయలు డిపాజిట్ చేశాడని గుర్తు చేశారు. తాను లేఖ రాస్తేనే రూ. 500, రూ. 1000 నోట్లను ప్రధాని రద్దు చేశారని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ధైర్యం, దమ్ము ఉంటే రూ. 2 వేల నోటును రద్దు చేయించాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News