: గృహ హింస కేసులో.. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అల్లుడు అరెస్ట్


ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అల్లుడు సయిద్ మహ్మద్ ఇమ్రాన్ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తన భార్య, షీలా కుమార్తె లతికను గృహహింసకు గురిచేసినందుకు కేసు నమోదు కాగా, విచారణ జరిపిన పోలీసులు, ప్రాథమిక సాక్ష్యాలున్నాయని నిర్థారించి ఇమ్రాన్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. లతిక నుంచి ఇమ్రాన్ పది నెలల క్రితం విడిపోయారు. మూడేళ్ల నాడు అధికారాన్ని కోల్పోయిన తరువాత షీలా ఇంట విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. తన భర్త తనను హింసిస్తున్నాడని లతికా దీక్షిత్ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును విచారిస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News