: హైదరాబాద్‌లో కార్డన్ సెర్చ్.. పోలీసుల అదుపులో 14 మంది అనుమానితులు


హైదరాబాద్‌లోని చిలకలగూడలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో 14 మంది అనుమానితులు పట్టుబడ్డారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని 35 బైకులు, ఓ కారు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో మాటువేసిన అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు ఇటీవల పోలీసులు వరుసగా కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News