: బీ రెడీ! ఆకాశంలో అద్భుతం రేపే.. ఇప్పుడు తప్పితే మళ్లీ 2034 వరకు చూసే అవకాశం లేదు!
రేపు రాత్రి ఆకాశంలో కనిపించే అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ఇప్పుడు కనుక మిస్సయితే మళ్లీ అద్భుతాన్ని 2034 వరకు చూసే అవకాశం లేదు. దీంతో ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కంటే రేపు అత్యంత పెద్దగా(సూపర్ మూన్), అత్యంత ప్రకాశవంతంగా చంద్రుడు కనువిందు చేయనున్నాడు. 70 ఏళ్ల తర్వాత చంద్రుడు రేపు చాలా పెద్దగా కనిపించనున్నాడు. సోమవారం సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు 14 శాతం పెద్దగా 30 శాతం ప్రకాశవంతంగా కనిపించనున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మళ్లీ ఇటువంటి దృశ్యం 2034లోనే కనిపిస్తుందని పేర్కొన్నారు. సోమవారం సూర్యాస్తమయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని నాసా శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. సో.. బీ రెడీ!