: ఏంటిది? ప్రజల డబ్బులు ప్రజలకివ్వడానికి ఇన్ని ఇబ్బందులా?: కపిల్ సిబాల్ ఆగ్రహం
ప్రజల డబ్బు ప్రజలకివ్వడానికి ఇన్ని నిబంధనలా? అని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ప్రశ్నించారు. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంపై ఆయన మాట్లాడుతూ, ఇది మధ్యతరగతి, పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. ఆసుపత్రుల్లో యాజమాన్యాలు పాత నోట్లను అంగీకరించడం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం చెప్పిన మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అసలు పొంతన లేదని ఆయన తెలిపారు. ప్రజల డబ్బు ప్రజలు తీసుకునేందుకు గంటల తరబడి క్యూ కట్టాలా? అని అడిగారు. ప్రజల డబ్బు ప్రజలు కేవలం 2,000 రూపాయలు మాత్రమే తీసుకోవాలా? ఆ డబ్బేమన్నా బీజేపీదా? లేక ప్రధానిదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయకుండా ప్రజలనెందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారని ఆయన నిలదీశారు.