: నా కుమార్తె ఇప్పుడు ఆనందంగా ఉంది... ఆమె పెళ్లి గురించి నాకు ఆందోళన లేదు: ప్రియాంకా చోప్రా తల్లి


అందరు తల్లుల్లానే తాను కూడా తన కుమార్తె పెళ్లి గురించి ఆందోళన చెందానని బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా తెలిపారు. ప్రియాంక వివాహంపై ఆమె మాట్లాడుతూ, తన కుమార్తె బాలీవుడ్‌, హాలీవుడ్‌ అవకాశాలతో తీరికలేకుండా ఉందని చెప్పారు. అలాగే ఆమెకు ఇప్పట్లో వివాహం చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. కెరీర్‌, జీవితంలో ప్రియాంక సంతోషంగా ఉందని, ఆమె పెళ్లి గురించి తాను ఆందోళన చెందడం లేదని ఆమె అన్నారు. ఈ విషయంపై ఒకప్పుడు ఆందోళన చెందిన తాను, ఇప్పుడు సంతోషకర, సురక్షిత స్థితిలో ఉన్నానని తన కుమార్తె తనతో అన్నట్టు ఆమె వెల్లడించారు. తనకు తానుగా వివాహం చేసుకో అని తన కుమార్తెను ఒత్తిడి చేయబోనని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News