: జయలలిత పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.. త్వరలోనే డిశ్చార్జి చేస్తాం: ‘అపోలో’ అధినేత ప్రతాప్ రెడ్డి
తమిళనాడు సీఎం జయలలిత పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. జయ ఆరోగ్యంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆమెకు మెరుగైన వైద్యం అందుతోందని, ఇన్ ఫెక్షన్ పూర్తిగా తగ్గిందని, త్వరలో డిశ్చార్జి చేస్తామని చెప్పారు. కాగా, సెప్టెంబర్ 22న జ్వరం, ఇన్ ఫెక్షన్ తో చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరారు. ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పలు వదంతులు వ్యాపించాయి. జయ హెల్త్ రిపోర్టు విడుదల చేయడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శించడం, ఆమె ఆరోగ్యం మెరుగుపడాలని ‘అమ్మ’ అభిమానులు పూజలు నిర్వహించడం విదితమే.