: ఆ వార్తలు తప్పు.. చైనా అధ్యక్షుడితో నేను మాట్లాడలేదు: ట్రంప్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఆయనకు చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ ఫోన్ చేసి అభినందించారంటూ చైనా సెంట్రల్ టీవీలో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ తో ట్రంప్ మాట్లాడుతూ, చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది ప్రపంచనేతలతో తాను మాట్లాడానని, వారి అభినందనలు అందుకున్నానని చెప్పారు. కాగా, చైనా-అమెరికా దేశాల సంబంధాలకు తాను అధిక ప్రాధాన్యమిస్తున్నానని, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని జీజిన్ పింగ్ తో ట్రంప్ అన్నట్లు చైనా సెంట్రల్ టీవీ వార్తలు ప్రసారం చేసింది.

  • Loading...

More Telugu News