: బుల్లెట్ ట్రెయిన్ లో ప్రయాణించిన భారత్, జపాన్ ప్రధానులు


మూడు రోజుల జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆ దేశ ప్రధాని షింజో అబేతో కలిసి హైస్పీడ్ బుల్లెట్ ట్రెయిన్ షింకన్ సేన్ లో ప్రయాణించారు. టోక్యో నుంచి ఒసాకా తీరంలోని కోబ్ నగరం వరకు వారి ప్రయాణం కొనసాగింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి, సంయుక్త కార్యదర్శి వికాస్ స్వరూప్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News