: పెద్దనోట్ల రద్దుకు ముందే బీజేపీ కీలక నేతల దగ్గర రూ.2 వేల నోట్లు ఉన్నాయి: సీఎం కేజ్రీవాల్


రూ.500, రూ.1000 నోట్లు రద్దు కాకముందే బీజేపీ కీలక నేతల దగ్గర రూ.2వేల నోట్లు ఉన్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్దనోట్ల రద్దు విషయం ప్రధాని మోదీ సన్నిహితులకు ముందే తెలుసని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుతో బీజేపీ నేతలకు భారీ లబ్ధి చేకూరిందని, ఈ నోట్ల రద్దు వెనుక అతిపెద్ద కుంభకోణం ఉందని ఆయన ఆరోపించారు. నల్లకుబేరులు డాలర్లను బ్లాక్ లో కొంటున్నారని, ఇది సామాన్యులపై జరిగిన సర్జికల్ స్ట్రయిక్ అని విమర్శించారు. ఇది ఉద్దేశపూర్వకంగా సృష్టించిన సంక్షోభమని, నల్లధనం ఎవరి దగ్గర ఉందో కేంద్రం బహిర్గతం చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News