: జీవీ గారూ, నా ఉద్యోగాన్ని ఊడగొట్టేలా ఉన్నారే!: నారా లోకేష్ చమత్కారం


ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు నిన్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెక్కులు అందజేశారు. అనంతరం కార్యకర్తల కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. గుంటూరులో నిన్న నిర్వహించిన యువ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఈ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ చాలా కృషి చేస్తున్నారని... భవిష్యత్ ముఖ్యమంత్రి ఆయనే అని అన్నారు. దీంతో, వెంటనే లోకేష్ కల్పించుకుని... 'జీవీ గారూ, మీ మాటలతో నా ఉద్యోగాన్ని ఊడగొట్టేలా ఉన్నారే' అంటూ చలోక్తి విసిరారు. దీంతో, అక్కడున్న వారంతా సరదాగా కాసేపు నవ్వుకున్నారు.

  • Loading...

More Telugu News