: జుట్టు ఊడటం వల్లే... ఫామ్ కోల్పోయాడట


2015 వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషించిన టీమిండియా ప్లేయర్ మోహిత్ శర్మ గుర్తున్నాడా. మొహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ లతో కలసి ఇండియాను సెమీస్ వరకు చేర్చాడు ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్. మొత్తం ఎనిమిది మ్యాచ్ లలో 13 వికెట్లు పడగొట్టాడు. అలాంటి మోహిత్ శర్మ ఇప్పుడు ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. జట్టుకు కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ లో కూడా అతని ప్రదర్శన అంతంతమాత్రంగానే తయారయింది. ఈ నేపథ్యంలో తాను ఫామ్ కోల్పోవడానికి మోహిత్ చెప్పిన కారణం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. తన జుట్టు ఊడిపోవడాన్ని గమనించానని... దీంతో తాను ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయానని... అందుకే తన బౌలింగ్ దెబ్బతిందని మోహిత్ చెప్పాడు.

  • Loading...

More Telugu News