: బంగారు తెలంగాణ కాదు... బతికే తెలంగాణ కావాలి: తమ్మినేని


తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ అవసరం లేదని... బతికే తెలంగాణ కావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేకపోయారని ఆయన మండిపడ్డారు. కేవలం మాటలు చెబుతూ, ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని, ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ పథకాలు అడ్రస్ లేకుండా పోయాయని చెప్పారు. కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News