: టోల్ గేట్ ఫీజు వసూళ్ల నిలుపుదల గడువు పొడిగింపు
దేశ వ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద పన్నుల వసూళ్ల నిలుపుదల గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి వరకు టోల్ ఫీజు వసూలు చేయరాదంటూ ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నాటి నుంచి టోల్ గేట్ ఫీ ను రెండు రోజుల పాటు రద్దు చేశారు. అయితే, బ్యాంకులు రద్దీగా ఉండటంతో పాతనోట్లను మార్చుకునే అవకాశం అందరికీ ఒకేసారి లభించకపోవడం, ఏటీఎంలలో పెడుతున్న చిన్ననోట్లు తక్కువ సమయంలోనే అయిపోతుండటం, రూ.500 కొత్త నోట్లు ఇంకా విడుదల కాకపోవడం తదితర కారణాల వల్ల ప్రజలు తాత్కాలిక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దనోట్లకు తిరిగి సరిపడా చిల్లర ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో టోల్ గేట్ ఫీజు చెల్లించడం కష్టసాధ్యమని భావించిన కేంద్ర ప్రభుత్వం, టోల్ గేట్ ఫీజును మరికొన్ని రోజుల పాటు రద్దు చేసింది.