: విజయ్, మిశ్రా అవుట్... 319 పరుగుల వద్ద ముగిసిన మూడో రోజు ఆట


రాజ్ కోట్ వేదికగా తొలిటెస్టులో సెంచరీల మోత మోగింది. తొలి రెండు రోజులు ఇంగ్లండ్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలతో కదం తొక్కగా, మూడో రోజు భారత్ రెండు సెంచరీలతో దీటుగా సమాధానమిచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 537 పరుగులవద్ద ఇన్నింగ్స్ ముగించింది. దీంతో రెండో రోజు టీమిండియా 63 పరుగులు చేసింది. ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. గంభీర్ కేవలం 29 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అనంతరం మురళీ విజయ్ కు జతకలిసిన హోం బాయ్ ఛటేశ్వర్ పూజారా భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. శైలికి భిన్నంగా దూకుడుగా ఆడాడు. దీంతో గంభీర్ అవుటైన అనంతరం బ్యాటింగ్ కు దిగినా మురళీ విజయ్ కంటే ముందుగా సెంచరీ సాధించాడు. అనంతరం దూకుడు మరింత పెంచే క్రమంలో కెప్టెన్ కుక్ కు సెకెండ్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి 124 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అనంతరం కొద్దిసేపట్లో మూడోరోజు ఆటముగిస్తుందనగా విజయ్ ఆడిన బంతిని హమీద్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 126 పరుగుల వద్ద టీమిండియా మురళీ విజయ్ వికెట్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. దీంతో కోహ్లీకి జతగా అమిత్ మిశ్రాను బ్యాటింగ్ కు పంపారు. క్రీజులో దిగిన మిశ్రాకు కోహ్లీ సూచనలు చేశాడు. అయితే ఆడిన రెండోబంతికే మిశ్రా అవుటవ్వడం విశేషం. అచ్చం మురళీ విజయ్ ఎలా అవుటయ్యాడో అదే రీతిన మిశ్రాను హమీద్ ఒడిసిపట్టేశాడు. దీంతో మూడోరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 108.3 ఓవర్లలో 319 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఇంగ్లండ్ కంటే ఇంకా 218 పరుగులు వెనకబడింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, అన్సారీ, రషీద్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News