: పెద్దనోట్ల రద్దు ప్రభావం: రెండు గంటల్లో ఐదు కోట్ల రూపాయల పన్నుల వసూళ్లు రాబట్టిన జీహెచ్ఎంసీ


నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆ నోట్ల‌తో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి ప‌న్నులు క‌డుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోయింది. జీహెచ్ఎంసీ స‌హా రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ప్ర‌జ‌లు క‌ట్టాల్సిన ప‌న్నులను కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన నోట్ల‌తో ఈరోజు పన్నులు క‌ట్ట‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌టన రావ‌డంతో త‌మ వ‌ద్ద ఉన్న పాత‌ నోట్ల‌ను తీసుకొని ప‌న్నుల బ‌కాయిల‌ను చెల్లించ‌డానికి ప్ర‌జ‌లు ఎంతో ఉత్సాహం చూపారు. దీంతో జీహెచ్ఎంసీకి కేవ‌లం రెండు గంటల్లోనే ఐదు కోట్ల రూపాయల పన్నులు వసూలయ్యాయి. ప్ర‌స్తుతం చలామ‌ణిలో లేని నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకోవాలంటే బ్యాంకు అధికారులు గుర్తింపు కార్డులు చూపించాల‌ని అడుగుతున్నారు. త‌మ వ‌ద్ద అధిక‌ మొత్తంలో ఉన్న డ‌బ్బు ప‌న్నులు క‌ట్ట‌డానికైనా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అనుకుంటున్న ప్ర‌జ‌లు బ‌కాయిప‌డ్డ‌ మొత్తం పన్నుల‌ను కట్టేస్తున్నారు. జీహెచ్ఎంసీ రాబ‌డుతున్న ప‌న్ను ప‌సూళ్లు ఈ రోజు సాయంత్రానికి మ‌రింత పెర‌గ‌నున్నాయి.

  • Loading...

More Telugu News