: రూపాయి విలువపై ట్రంప్ ఎఫెక్ట్!.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!


డాలర్ తో రూపాయి మారకపు విలువ శుక్రవారం నాడు గణనీయంగా పడిపోయింది. నేటి ఫారెక్స్ సెషన్ లో డాలర్ తో రూపాయి మారకపు విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 54 పైసలు దిగజారి రూ. 67.17కు దిగజారింది. ఇటీవలి కాలంలో రూపాయి విలువ ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. కాగా, నేటి మార్కెట్ సైతం తీవ్ర ఒడిదుడుకుల్లో సాగుతోంది. సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 8,400 పాయింట్ల దిగువకు చేరింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు తమ వాటాలను విక్రయిస్తుండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News