: కొత్త నోట్ల పుట్టు పూర్వోత్తరాలు, తల్లిదండ్రుల వివరాలు... సోషల్ మీడియా వైరల్


కొత్త నోట్లపై మురిపెం సామాజిక మాధ్యమాలను పట్టుకుంది. చేతిలో రూ. 500, రూ. 2000 నోటును పట్టుకుని సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసి రోజంతా, లైకులను లెక్కిస్తూ గడిపిన వారెందరో. ఇక మరికొందరు తమ సృజనాత్మకతకు పదునుపెట్టి కొత్త నోట్లు పుట్టుపూర్వోత్తరాలు, తల్లిదండ్రుల వివరాలంటూ పెట్టిన పోస్టు శరవేగంగా చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టులో "కొత్త నోటు పుట్టిన తేదీ: 08-11-2016. బారసాల/నామకరణం తేదీ: 10-11-2016. తండ్రి నరేంద్ర మోదీ, తల్లి: రిజర్వ్ బ్యాంక్, బాబాయి: ఉర్జిత్ పటేల్., బంధువులు: ప్రజలు" అని ఉండగా, ఇది తెగ తిరిగేస్తోంది.

  • Loading...

More Telugu News