: శ్వేత సౌధంలో ట్రంప్ భార్యకు ఒబామా భార్య ఏం చెప్పారు?


అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాకు అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ అరుదైన ఆతిథ్యం ఇచ్చారు. శ్వేతసౌధంలో తన అనుభవాలను మెలానియాతో పంచుకున్నారు. ఒక్కసారి అధ్యక్ష భవనంలోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్నో భావోద్వేగాలు తమను అలముకుంటాయని... అవి ఎన్నటికీ వదిలిపెట్టలేనంతగా, ఎంతో గొప్పగా, అందంగా ఉంటాయని చెప్పారు. వైట్ హౌస్ లోని ప్రైవేట్ భవనంలో తిప్పుతూ, ప్రముఖమైన ట్రూమన్ బాల్కనీ వద్దకు తీసుకెళ్లారు మిషెల్లీ. గత ఎనిమిదేళ్లుగా తన పిల్లలను ఎలా పెంచిందీ మెలానియాతో ఆమె పంచుకున్నారు. శ్వేత సౌధంలో నివసించడం ఫిష్ బౌల్ లో ఉన్నట్టుంటుందని... మ్యూజియంలో జీవిస్తున్నంత అద్భుతంగా ఉంటుందని మిషెల్లీ తెలిపారు. మీకు కూడా ఇలాంటి అనుభూతులే కలుగుతాయని మెలానియాకు చెప్పారు. అంతేకాదు, త్వరలో వైట్ హౌస్ ను వదిలి వెళ్లనున్న నేపథ్యంలో, మధ్యమధ్యలో మిషెల్లీ భావోద్వేగానికి లోనయ్యారట.

  • Loading...

More Telugu News