: ట్రంప్ గెలుపుతో సంబరాలు చేసుకున్న ముస్లిం ఉగ్రవాద సంస్థలు!


అమెరికా నూతన అధ్యక్షుడి కోసం అమెరికన్లు, ప్రపంచ దేశాల కంటే ఆసక్తిగా మరొకవర్గం ఎదురు చూసింది. నిజానికి వారే అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అమితాసక్తి కనబరిచారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వారే ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదులు. ఎందుకంటే వివిధ దేశాలతో సంబంధాలు నెరపడంలో అనుభవమున్న హిల్లరీ గెలవడం ద్వారా అమెరికా విధానాల్లో ఎలాంటి మార్పులు సంభవించవని, అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే విధానాలన్నీ మారిపోతాయని, దీంతో ముస్లిం దేశాలు, ముస్లిమేతర దేశాలుగా ప్రపంచ దేశాల్లో స్పష్టమైన విభజన వస్తుందని, దీంతో తమ లక్ష్యం సులువు అవుతుందని, ముస్లిం దేశాల మద్దతు తమకు పూర్తిగా దొరకుతుందని ఉగ్రవాద సంస్థలన్నీ భావించాయి. అవి ఊహించనట్టుగానే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించారు. దీంతో ఉగ్రవాద సంస్థలైన డాయిష్ (ఐసిస్), లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ) లు సంబరాలు చేసుకున్నాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ట్రంప్ గెలుపుతో అమెరికాకు ‘చీకటి రోజులు’ (డార్క్ టైమ్స్) మొదలయ్యాయని, అమెరికన్లు తమ పతనాన్ని తామే కొనితెచ్చుకున్నారని ఉగ్రవాదులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలతో అత్యంత సన్నిహితంగా ఉండే సిద్ధాంత కర్తలు... బిలియనీర్ బిజినెస్‌ మన్ చేతిలో అమెరికా పతనం తప్పదని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెట్టి సంబరాలు చేసుకున్నారని ‘వాషింగ్టన్ పోస్టు’ తెలిపింది. ‘‘చాలా సంతోషంగా ఉంది. ట్రంప్ చేతుల్లో పడిన అమెరికా క్రమంగా పతనం అవుతుంది’’ అని డాయిష్ అనుబంధ అల్-మిన్‌ బార్ జిహాదీ మీడియా నెట్‌ వర్క్ సోషల్ మీడియాలో పేర్కొంది. ‘‘9/11న అమెరికాను ఆల్ ఖాయిదా నాశనం చేస్తే, 11/9న అమెరికా ఓటర్లే తమ దేశాన్ని నాశనం చేసుకున్నారు’’ అని జిహాదీ వెబ్‌ సైట్లను పర్యవేక్షించే ప్రైవేటు సంస్థ ఎస్ఐటీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రిట్జ్ కట్జ్ పేర్కొన్నారు. ‘‘ట్రంప్ ముస్లిం మధ్య ప్రాచ్యంలో అమెరికాను తిరిగి నంబర్ వన్ శత్రువగా మారుస్తారు’’ అంటూ అల్ ఖాయిదా అల్-మఖలాత్ ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసింది. ఈ నాలుగేళ్లు ట్రంప్ దిష్టిబొమ్మలా నిలబడడం తప్ప మరేమీ చేయలేరని, గతంలో బుష్‌ దీ ఇదే పరిస్థితి అని అందులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News