: సెట్ టాప్ బాక్స్ ల గడువు పొడిగింపు
హైదరాబాద్, విశాఖ నగరవాసులకు ఉపశమనం కలిగించే ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. సెట్ టాప్ బాక్స్ ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్ విచారణను జూన్ 4 కు వాయిదా వేసింది. అంతేకాదు ఈ రెండు నగరాలలో సెట్ టాప్ బాక్స్ ల ఏర్పాటుకు నిన్నటితో ముగిసిపోయిన గడువును జూన్ 4 వరకూ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.