: ఢిల్లీలో బిజీగా బొత్స సత్యనారాయణ
పీసీసీ
అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కొద్దిసేపటి
క్రితమే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో ఆయన భేటీ అయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుత స్థితిగతులు, తెలంగాణ అంశం, తాజా రాజకీయాలపై ఈ
సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం కాంగ్రెస్
ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మరి కొందరితో కూడా ఆయన భేటీ అవుతారు.