: ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ట్రంప్ తో కలిసి పనిచేస్తాం: పాకిస్థాన్
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అమెరికాతో కలసి ముందుకెళతామని పాకిస్థాన్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తో కలసి పని చేస్తామని ప్రకటించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సలహాదారు సర్తాజ్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. పాకిస్థాన్ ను ట్రంప్ నేరుగా విమర్శించారని, కొన్ని ఉగ్రవాద సంస్థలతోనే పోరాడుతూ మిగిలిన వాటిని పాక్ వదిలేస్తోందని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, 'అదంతా గతం' అని చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనకు ట్రంప్ తో కలిసే పోరాడతామని తెలిపారు.