: టీమిండియా ఫీల్డర్లు కీలక క్యాచ్లను వదిలేశారు: టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించడం పట్ల బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందించారు. ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించడానికి టీమిండియా ఫీల్డర్లు కీలక క్యాచ్లను వదిలేయడమే కారణమని అన్నారు. భారత్ కు ఉన్న అనుకూల పరిస్థితులను ఉపయోగించుకోవడంలో ఆటగాళ్లు సక్సెస్ కాలేకపోయారని ఆయన పేర్కొన్నారు. మ్యాచులో మొదట బ్యాటింగ్‌కు దిగినా, బౌలింగ్ చేసినా ఆ అంశం సమస్య కాదని సంజయ్ బంగర్ చెప్పారు. ఫీల్డర్లు క్యాచులు వదిలేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంగ్లండ్ మాత్రం తమకు వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకోవడంలో విజయం సాధించిందని చెప్పారు. రాజ్‌కోట్ మైదానం బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని, ఇంగ్లండ్ ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదని చెప్పారు. ఈ రోజు కొనసాగుతున్న ఆట చాలా ముఖ్యమని, మొదటి ఇన్సింగ్స్ మ్యాచులో కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు.