: చంద్రబాబును చూస్తుంటే కన్యాశుల్కంలోని 'మధురవాణి' గుర్తొస్తోంది: అంబటి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తుంటే కన్యాశుల్కంలోని మధురవాణి పాత్ర గుర్తొస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తమ అధినేత జగన్ అడ్డుపడుతున్నారంటూ టీడీపీ నేతలు నోరు పారేసుకుంటున్నారని... ఇది సరైంది కాదని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా టీడీపీ నేతల పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. జగన్ ను విమర్శించే అర్హత నారా లోకేష్ కు లేదని అన్నారు. కాకిపిల్ల కాకే అవుతుందని... కోకిల కాలేదని సెటైర్ వేశారు. అధికారం కోసం జగన్ తాపత్రయపడటం లేదని... అలా తాపత్రయపడేది నారా వంశస్తులేనని అన్నారు. హైదరాబాదులోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News