: కొత్త సైజ్, కొత్త డిజైన్ లో అతి త్వరలో రూ. 1000 నోటు: ఫైనాన్స్ మినిస్ట్రీ
ప్రస్తుతం రద్దయిన రూ. 1000 నోట్ల స్థానంలో అదే డినామినేషన్ తో కూడిన కొత్త నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కొత్త నోట్లు ఎలా ఉండాలన్న విషయమై చర్చిస్తున్నామని, కొత్త సైజ్, కొత్త డిజైన్ లో ఉండే వీటిని త్వరలో ముద్రించి విడుదల చేస్తామని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శశికాంత్ దాస్ గుప్తా వెల్లడించారు. వచ్చే సంవత్సరం 1 నుంచి జీఎస్టీ అమలు కానున్న నేపథ్యంలో కొత్త కరెన్సీ రావడం దేశ ఆర్థిక వ్యవస్థకు, పన్ను వసూళ్లకు అత్యంత కీలకమని ఆయన అన్నారు. లెక్కలోకి రాని కోట్ల రూపాయల డబ్బును అలాగే వదిలేసి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంలో భాగంగానే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.