: అమెరికాకు 46వ ప్రెసిడెంట్ గా కిమ్ కర్దాషియన్ అవ్వచ్చు!.. సోషల్ మీడియాలో జోకులు


ఎవరూ ఊహించని అనూహ్య విజయాన్ని సాధించి, అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పై సామాజిక మాధ్యమాల్లో సెటైర్ల మీద సెటైర్లు పేలుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా నుంచి హాలీవుడ్ సెలబ్రిటీల వరకూ ఆయన్ను దూరం పెట్టాలనే కోరినప్పటికీ, ట్రంప్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక హాలీవుడ్ ప్రముఖలు చాలా మంది మరో ముందడుగు వేసి ట్రంప్ పై తమ అక్కసు వెళ్లగక్కారు. తదుపరి 46వ ప్రెసిడెంట్ గా హాట్ బ్యూటీ, రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ ఎన్నికవుతుందని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయి. ట్రంప్ గెలవడాన్ని చూసి, తన జీవితంలోనే విపరీతంగా భయపడ్డానని 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' ఫేం కునాల్ నయ్యర్ ట్వీటాడు. ట్రంప్ గెలుపుపై పాప్ స్టార్లు ఆరియానా గ్రాండే, లేడీ గాగా, ఎల్లెన్ తదితరులు బహిరంగంగానే నిరసన తెలియజేస్తున్నారు.

  • Loading...

More Telugu News