: దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ముష్కరుడిని కాల్చి చంపిన జవాన్లు
భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ప్రయత్నాన్ని మన భద్రతాబలగాలు నిర్వీర్యం చేశాయి. ఈ క్రమంలో, ఓ ఉగ్రవాదిని కాల్చి చంపాయి. ఈ ఘటన జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిట్టా రాంపూర్ సెక్టార్ లో జరిగింది. ఘటన అనంతరం, ఆ ప్రాంతంలో భారత సైన్యం ముమ్మర గాలింపు చేపట్టింది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత నియంత్రణ రేఖ వద్ద... కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.