: ట్రంప్ కు నేను ఎప్పటికీ వ్యతిరేకమే... నో సీక్రెట్: ఒబామా


అమెరికా అధ్యక్ష పదవికి ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ ఆలోచనా సరళికి తానెప్పుడూ వ్యతిరేకమేనని, ఇందులో ఎలాంటి దాపరికమూ లేదని ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ట్రంప్ కు, తనకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, అయినప్పటికీ, అధికార మార్పిడి సాఫీగా సాగేందుకు తాను, తన బృందం పూర్తిగా సహకరిస్తామని అన్నారు. తాను కూడా గతంలో ఎన్నికల్లో ఓడిపోయానని గుర్తు చేసుకున్నారు. తాజా ఫలితాలతో అమెరికాలో ఆందోళన చెందుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని, ఎలాంటి భయాలూ పెట్టుకోనక్కర్లేదని అన్నారు. "ఎనిమిది సంవత్సరాల క్రితం బుష్ కు, తనకు మధ్య భేదాభిప్రాయాలు వున్నా, వారి బృందం హుందాగా అధికారాన్ని నాకు అందించారు. నేనూ అదే పనిని చేస్తాను. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు అత్యుత్తమమైనవని ఈ ఉద్యోగం చేస్తున్న సమయంలో మీరు గుర్తిస్తారు" అని ట్రంప్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News