: నూజివీడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
కృష్ణా జిల్లా నూజివీడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక అడవి ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ముందు వెళ్తున్న ఆటోను వేగంగా వస్తున్న లారీ ఢీనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నూజివీడు స్టేషన్ తోటకు చెందిన వారిగా గుర్తించారు. జంగారెడ్డిగూడెంలోని గుబ్బల మంగమ్మ ఆలయానికి వారు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.