: గత 30 ఏళ్లుగా ఆయన అంచనాలు తప్పుకాలేదు... ఇప్పుడు కూడా ఆయన చెప్పినట్టు ట్రంపే గెలిచారు!


సర్వేలన్నీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీనే గెలుస్తారని చెబితే... ఆయన మాత్రం డొనాల్డ్ ట్రంపే గెలుస్తారని చెప్పారు. అయితే ఆయన చెప్పిన విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ, చివరకు ఆయన చెప్పిందే నిజమైంది. ఆయన చెప్పినట్టు ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ గెలుస్తారని చెప్పిన వ్యక్తి ప్రొఫెసర్ అలాన్ లిచట్మన్. గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని ఆయన కచ్చితంగా అంచనా వేస్తున్నారు. 1984 నుంచి ఆయన అంచనా వేసిన అభ్యర్థులే అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. అయితే, ఏదో ఆషామాషీగా అంచనా వేసి, ఈ ప్రొఫెసర్ గారు తన అభిప్రాయాలను చెప్పలేదు. ప్రజల మనోభావాలు, రాజకీయ అభిప్రాయాలను బేరీజువేసుకునే ఆయన తన అంచనాలను వెల్లడించేవారు. ట్రంప్ ఎందుకు గెలుస్తారో వివరిస్తూ 'ప్రిడిక్టింగ్ ద నెక్ట్స్ ప్రెసిడెంట్: ద కీస్ టు వైట్ హౌస్ 2016' అనే పుస్తకాన్ని ఆయన రచించారు. అప్పట్లో ఆయన చెప్పిందాన్ని ఎవరూ నమ్మలేదు. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన జోస్యం మరోసారి నిజమైనట్టయింది.

  • Loading...

More Telugu News