: పెద్దనోట్ల రద్దు ప్రభావం: వాహనదారులకు ఊరట... దేశవ్యాప్తంగా ఈ నెల 11 అర్ధరాత్రి వరకు టోల్‌ట్యాక్స్ రద్దు
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద ఈ రోజు ఉదయం నుంచి భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడంతో పాటు టోల్‌ఫ్లాజా సిబ్బందితో వాహనదారులు వాగ్వాదం చేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భారత జాతీయ రహదారుల సంస్థ ఛైర్మన్ ఈ నెల 11 అర్ధరాత్రి వరకు 500, 1000 నోట్లను స్వీకరించాలని టోల్‌ప్లాజా యాజమాన్యాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే, మళ్లీ తాజాగా కేంద్రం మరో ప్రకటన విడుదల చేసింది. ఎల్లుండి అర్ధరాత్రి వరకు టోల్‌ట్యాక్స్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది.