: ‘జయహో ట్రంప్’.. న్యూఢిల్లీలో హిందూసేన సంబరాలు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటీలోకి దిగినప్పటి నుంచి ఆయన గెలవాలని కోరుకుంటూ ఆయనకు మద్దతుగా పూజలు నిర్వహిస్తూ వస్తోన్న హిందూ సంస్థలు ఈ రోజు పండుగ చేసుకుంటున్నాయి. ఆయన విజేతగా నిలిచిన వెంటనే హర్షం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలో హిందూసేన కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటూ కనిపించారు. చేతిలో ట్రంప్ పోస్టర్లు, ఫ్లకార్డులను పట్టుకుని ట్రంప్ జిందాబాద్, జయహో ట్రంప్ అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. 'ఇండియా లవ్స్ ట్రంప్' అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.