: అతను గెలిచినా అమెరికాకు ముస్లింలు... 'రాయల్ జోర్డాన్' స్పెషల్ యాడ్ వైరల్
"నేను అధ్యక్షుడినైతే అమెరికాలోకి ఒక్క ముస్లింను కూడా రాకుండా నిషేధం విధిస్తా" ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్ చేసిన నినాదమిది. ఉగ్రవాదం పట్ల భయాందోళనలకు గురవుతున్న అమెరికన్ సమాజాన్ని ఈ నినాదం ఆకర్షించడం కూడా ట్రంప్ ను విజయతీరాలకు చేర్చడానికి సహకరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ విజయం సాధిస్తారని ముందే ఊహించిందో ఏమో జోర్డాన్ ఎయిర్ లైన్స్ సంస్థ 'రాయల్ జోర్డాన్నియన్ ఎయిర్ లైన్స్' ఓ ప్రకటనను విడుదల చేసింది. ''ఒకవేళ అతను గెలిచినా, అమెరికా ప్రయాణానికి మీకు ఎప్పటికీ అనుమతి ఉంటుంది'' అని హెడ్ లైన్ ఉంచుతూ, చికాగో, డెట్రాయిట్, న్యూయార్క్ నగరాలకు విమాన టికెట్ ధరలను ఇచ్చింది. ఇక ఈ ట్వీట్ కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే దాదాపు 3 వేల రీట్వీట్స్ తెచ్చుకుంది.