: అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గత ట్విట్టర్ రికార్డు బద్దలు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడితో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా పోస్టులు చేస్తున్నారు. అమెరికా ఎన్నికల రోజు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో ఖాతాదారులు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా 3.5 కోట్ల ట్వీట్లు చేశారు. ట్విట్టర్ చరిత్రలోనే ఇది అత్యధిక రికార్డుగా నమోదైంది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 7:30 నిమిషాల వరకు అమెరికా ఎన్నికలకు సంబంధించి ట్విట్టర్లో ఇంతటి అధిక సంఖ్యలో ట్వీట్లు చేశారు. గతంలోనూ ఈ రికార్డు అమెరికా ఎన్నికల రోజునే నమోదైంది. 2012లో అత్యధికంగా ట్విట్టర్ ఖాతాదారులు 3.20 కోట్లకు పైగా ట్వీట్లు చేశారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు ట్విట్టర్‌లో కోటి 31 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, హిల్లరీ క్లింటన్‌కు కోటి నాలుగు లక్షలమంది ఉన్నారు.