: వైరల్ అవుతున్న ట్రంప్, మెలానియా ఫొటో!


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియాల ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. పోలింగ్ బూత్ లో ట్రంప్, మెలానియాలు పక్కపక్కనే నిలబడి ఓటు వేశారు. మెలానియా ఓటు వేస్తున్న సమయంలో, తన భార్య ఎవరికి ఓటు వేస్తుందో అన్నట్టుగా ట్రంప్ తొంగి చూస్తున్నారు. ఈ విజువల్స్ అంతర్జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ ఫొటోపై ఫేస్ బుక్, ట్విట్టర్ లో నెటిజన్లు జోకులు వేస్తున్నారు. 'హిల్లరీకి ఓటు వేద్దామంటే ట్రంప్ నన్నే చూస్తున్నాడు' అని మెలానియా అనుకుంటున్నట్టు నటుడు డేవిడ్ ట్వీట్ చేశాడు. ఇదే విధంగా ఈ ఫొటోపై పలువురు పలు విధాలుగా జోక్ వేశారు.

  • Loading...

More Telugu News