: మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. గంట గంటకూ చేతులు మారుతున్న ఆధిక్యం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో, మ్యాజిక్ ఫిగర్ కు చేరువలోకి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ వచ్చారు. మ్యాజిక్ ఫిగర్ 270 కాగా... ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం... ఎలక్టోరల్ కాలేజీలో ప్రస్తుతం 254 ఓట్లతో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు హిల్లరీ 215 ఓట్లతో వెనుకబడిపోయారు. ఎన్నికల ఫలితాల్లో మొదట ట్రంప్ ఆధిక్యంతో నిలవగా... కాసేపటి తర్వాత హిల్లరీ ముందంజలో నిలిచారు. ఆ తర్వాత దూసుకుపోయిన ట్రంప్... ఒకానొక సమయంలో ఏకంగా 57 ఓట్ల ఆధిక్యతను సాధించారు. కాలిఫోర్నియా రాష్ట్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆధిక్యంలోకి దూసుకుపోయిన హిల్లరీ... ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయారు.