: అనారోగ్యం నుంచి కోలుకున్న కరుణానిధి
డీఎంకే అధినేత కరుణానిధి పూర్తిగా కోలుకున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 14వ తేదీన పార్టీ కీలక నేతలతో ఆయన సమావేశమవుతారని తెలిపారు. అలర్జీ కారణంగా రెండు వారాల కిందట ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో... ఉపఎన్నికలు జరుగుతున్న మూడు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పనుల్లో కూడా ఆయన జోక్యం చేసుకోలేదు. అనారోగ్యానికి గురైన ఆయన... తన స్వగృహంలోనే చికిత్స పొందారు. గత 15 రోజుల నుంచి పార్టీ కార్యకలాపాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. 14వ తేదీన పార్టీ కార్యాలయానికి వచ్చి, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై కరుణానిధి చర్చిస్తారని డీఎంకే నేతలు తెలిపారు.