: నేడు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఈ రాత్రి ఢిల్లీకి పయనమవుతున్నారు. రేపు అక్కడ జరగనున్న పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉన్నత విద్యారంగంపై 'ఫిక్కీ' నిర్వహించనున్న సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన జరగబోతున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ కు వివిధ పరిశ్రమలు, కంపెనీల సీఈవోలు హాజరవుతున్నారు. అంతేకాదు, పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే సూచనలు కనపడుతున్నాయి.