: ఇంకా డిన్నర్ చేయని ట్రంప్... ఓ వైపు కౌంటింగ్ జరుగుతుంటే ట్రంప్ చేస్తున్నదిదే!
ఓవైపు నరాలు తెగే ఉత్కంఠ మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంటే, రిపబ్లికన్ల తరఫున పోటీ పడిన డొనాల్డ్ ట్రంప్ తాపీగా డైట్ కోక్ తాగుతూ, ఓ టీవీ చానల్ పెట్టుకుని ఫలితాలను చూస్తూ కూర్చుని ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గులియానీ స్వయంగా వెల్లడించారు. రిపబ్లికన్ నాయకులతో ఆయన సమావేశమయ్యారని, పలు రాష్ట్రాల ఫలితాలు చూసి, విజయంపై ప్రశాంతంగా ఉన్నారని, ఇంకా డిన్నర్ చేయలేదని ట్రంప్ సన్నిహితులు వెల్లడించారు. ఆయన టీమ్ ఫలితాలను విశ్లేషిస్తున్నదని పేర్కొన్నారు.