: ట్రంప్ కు షాక్ ఇచ్చిన జార్జ్ బుష్


అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీకే చెందిన జార్జ్ బుష్ సాధారణంగా ట్రంప్ కే ఓటు వేయాలి. కానీ, ఆయన ట్రంప్ కు ఓటు వేయలేదు. ఈ ఎన్నికల్లో ట్రంప్ కు గానీ, హిల్లరీకి గానీ ఓటు వేయకూడదని బుష్ నిర్ణయించుకున్నారు. తన సొంత పార్టీకి చెందిన బుష్ తనకు ఓటు వేయకపోవడం ట్రంప్ ను చాలా బాధించే అంశమే. అయితే, బుష్ నిర్ణయం తనపై ప్రభావం చూపదని... కానీ, ఇది బాధాకరమని ట్రంప్ అన్నారు. మరోవైపు, సర్వేలు చెప్పినదానికి విరుద్ధంగా అమెరికాలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. హిల్లరీకి అందనంత ఆధిక్యతతో ట్రంప్ దూసుకుపోతున్నారు.

  • Loading...

More Telugu News