: రూ. 500కు పెట్రోల్ కొట్టించుకోండి... చిల్లర మాత్రం అడగొద్దు: బంకుల అసోసియేషన్
ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను పెట్రోలు బంకుల్లో స్వీకరిస్తున్నప్పటికీ, వారి వద్ద వంద నోట్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో పలు బంకులను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంకుల్లోకి వస్తున్న వారు రూ. 1000 నోటిచ్చి వంద లేదా రెండొందలకు పెట్రోలు కొట్టమని అడుగుతుంటే, మిగతా చిల్లర ఇచ్చుకోలేక బంకుల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పెట్రోల్ బంక్ అసోసియేషన్ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ స్పందిస్తూ, వాహనదారులు రూ. 500కు పెట్రోలు కొట్టించుకోవాలని సలహా ఇచ్చారు. బంకులకు వచ్చి చిల్లర మాత్రం అడగవద్దని చెప్పిన ఆయన, బంకుల సిబ్బంది సైతం తమ సమస్య చెప్పి కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కోరారు.