: అమెరికా ఎన్నికల పోలింగ్‌లో కలకలం.. లాస్‌ఏంజెలెస్ పోలింగ్ బూత్ వద్ద కాల్పులు
అమెరికాలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌లో కలకలం చోటుచేసుకుంది. లాస్‌ఏంజెలెస్‌లోని పోలింగ్ బూత్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. దీంతో పోలీసులు పోలింగ్‌ను నిలిపివేశారు. కాగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పోలింగ్ పూర్తయింది. పోలింగ్ పూర్తయిన రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ట్రంప్ ముందంజలో ఉన్నారు. మొదట్లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ కంటే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ బాగా ముందంజలో ఉండగా ప్రస్తుతం ఆ వ్యత్యాసం బాగా తగ్గింది.