: నల్లధనంపై మోదీ సర్జికల్ స్ట్రయిక్స్.. ఐడీఎస్‌తో బయటపడిన 65 వేల మంది


ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వం స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని (ఐడీఎస్) ప్రవేశపెట్టింది. నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న ‘అక్రమ’ ధనాన్ని ప్రభుత్వానికి అప్పజెబితే ఎటువంటి విచారణలు ఉండవని, పేర్లు బయటపెట్టబోమని సువర్ణావకాశం ఇచ్చారు. అయినా ఆ ప్రకటనను ‘నల్ల’వీరులు పెద్దగా పట్టించుకోలేదు. ‘‘ఆ నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు బోలెడన్ని మార్గాలు ఉన్నాయని’’ భావించి అలక్ష్యం చేశారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని సరెండర్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ 9 లక్షల మందికి లేఖ రాస్తే కేవలం 65 వేల మందే ముందు చూపుతో తమ వద్ద ఉన్న సొమ్మును ప్రభుత్వానికి అప్పగించి బతికిపోయారు. ఇలా మొత్తం రూ.65 వేల కోట్లను వారు వెల్లడించారు. ఈ మొత్తం సొమ్ములో తెలుగు రాష్ట్రాల వారి వాటానే అధికం కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒక్క హైదరాబాద్ నుంచే ఏకంగా రూ.13 వేల కోట్లు బయటకు వచ్చాయి. నిజానికి భవిష్యత్తులోనూ కూడబెట్టుకునే నల్లధనానికి ఆదాయపు పన్ను కట్టుకునే సువర్ణ అవకాశాన్ని చేజేతులా వదిలేసుకున్న నల్లకుబేరులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో భోరుమంటున్నారు. మరోవైపు రూ.1000, రూ.500 నోట్ల రద్దు సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న వర్గాలకు పిడుగుపాటుగానే చెప్పుకోవాలి. నల్లకోటీశ్వరులు తప్పు దిద్దుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన చివరి అవకాశాన్ని వినియోగించుకోలేకపోయినందుకు ఇప్పుడు వారంతా లబోదిబోమంటున్నారు.

  • Loading...

More Telugu News