: రెండువేల రూపాయల కొత్త నోట్ ‘పింక్’ అన్న అమితాబ్ బచ్చన్


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్తగా విడుదల చేయనున్న రెండు వేల రూపాయల కొత్త నోట్ కలర్ ‘పింక్’ అని.. అది ‘పింక్’ ఎఫెక్టు అంటూ బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. రూ.500, రూ.1000 నోట్లపై ఈ రోజు అర్ధరాత్రి నుంచి నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘పింక్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హర్షం వ్యక్తం చేశారు. అవినీతిని, నల్లధనాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

  • Loading...

More Telugu News