: కొత్త సిరీస్ లో విడుదల కానున్న నోట్లు ఇవే: ఆర్బీఐ గవర్నర్
కొత్త సిరీస్ లో రూ.10, రూ. 20, రూ.50, రూ.100 నోట్లు వస్తాయని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ వెల్లడించారు. డిపాజిట్ల స్వీకరణకు అదనపు కౌంటర్లు, సమయం కేటాయించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ లావాదేవీలు, చెక్కులు, డీడీల లావాదేవీలు యథావిధిగానే ఉంటాయని స్పష్టం చేశారు.