: రూ.500, రూ.2000 కొత్తనోట్లు విడుదల చేస్తాం: ప్రధాని మోదీ
రూ.500, రూ.2000 కొత్త నోట్లను జారీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. త్రివిధ దళాధిపతులతో భేటీ అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, దీపావళి మరునాడు వీధుల్లో చెత్తను ఊడ్చేసినట్లుగా, దేశంలో నల్లధనాన్ని ఊడ్చేద్దామని అన్నారు. రూ.500, రూ.1000 లను డిసెంబర్ 30 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేనివారు, తమ గుర్తింపుకార్డులు సమర్పించి మార్చి 31 లోపు డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. ఈ మొత్తం వ్యవహారం చక్కబెట్టేందుకు ఆర్ బీఐ, బ్యాంకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్నారు.