: కాంగ్రెస్ డ్రామాలో కోదండరాంది శిఖండి పాత్ర: బాల్క సుమన్
తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం కుబుసం విడిచిన నాగుపాములాంటి వారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేఏసీ ముసుగులో కోదండరాం టీఆర్ఎస్ పై చేస్తున్న దాడుల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోదండరాం రెండుసార్లు కలిశారని... ఎందుకు కలిశారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియాతో భేటీ తర్వాతే ఆయన మల్లన్న సాగర్ ఆందోళనల్లో పాల్గొన్నారని అన్నారు. కోదండరాం చెప్పేవి నీతులు, తీసేవి గోతులని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోలేకే కోదండరాంను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్ డ్రామాలో కోదండరాంది శిఖండి పాత్ర అని... ఆ పార్టీకి జీవం పోసే పనిలో ఆయన ఉన్నారని సుమన్ అన్నారు. కోదండరాంకు దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని... జేఏసీ ముసుగులో దాడి చేయడం సరికాదని సూచించారు.