: ఢిల్లీలో త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ సమావేశం.. భేటీకి హాజరైన అజిత్ ధోవల్
దేశ రాజధాని ఢిల్లీలో భారత త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కొద్ది సేపటి క్రితం సమావేశమయ్యారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భద్రత అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఇటీవలే చైనా అధికారులతో కీలక చర్చలు జరిపి, ఇరు దేశాల మధ్య ఉన్న ఉగ్రవాద నిరోధం, రక్షణ, విదేశీ వ్యవహారాలపై పలు ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. చైనాతో చర్చల అంశాన్ని కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.