: బాలీవుడ్ టాప్ కమెడియన్ ఇల్లు అక్రమ కట్టడమేనా?
ఆఫీసు అప్రూవల్ కోసం 5 లక్షల రూపాయల లంచం ఇవ్వాల్సి వచ్చింది...అచ్చేదిన్ అంటే ఇదేనా? అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి నేరుగా ప్రశ్నను సంధించిన బాలీవుడ్ బుల్లి తెర స్టార్ కమెడియన్ కపిల్ శర్మ నివాసంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆయన నివాసంపై ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ముంబైలోని అంధేరీలో గల ఫోర్ బంగ్లాస్ ఏరియాలో గల ఈ నిర్మాణం పూర్తి అక్రమ కట్టడమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే ఈ నివాసం అక్రమ కట్టడమే నంటూ ముంబై మున్సిపల్ (బీఎంసీ) అధికారులు కూడా అంటున్నారు. అందుకు తమ వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కాగా, కపిల్ శర్మ బంగ్లా విషయంలో కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టు స్థానిక కో-ఆపరేటివ్ సోసైటీ చైర్మన్ అనురాగ్ పాఠక్ తెలిపారు. దీంతో కపిల్ శర్మ చిక్కుల్లో పడ్డట్టేనని అంటున్నారు.